telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో 26 కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్ విడుదలైంది.

కొత్త జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాలను పూర్తి వివరాలు తెలుపుతూ ఏపీ సర్కార్ వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.

కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్-విజయవాడ జిల్లాలు ఏర్పాటు కానుండగా… కుప్పం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కాబోతోంది.. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లుగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయనుంది.

తుది నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు

1. శ్రీకాకుళం జిల్లా

జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
మొత్తం మండలాలు: 30
రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం,

2. విజయనగరం జిల్లా

జిల్లా కేంద్రం: విజయనగరం
మొత్తం మండలాలు: 27
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. పార్వతీపురం మన్యం జిల్లా

జిల్లా కేంద్రం: పార్వతీపురం
మొత్తం మండలాలు: 14
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ, పార్వతీపురం

4. అల్లూరి సీతారామరాజు జిల్లా

జిల్లా కేంద్రం: పాడేరు
మండలాలు: 22
రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం జిల్లా

జిల్లా కేంద్రం: విశాఖపట్నం
మొత్తం మండలాలు: 11
రెవెన్యూ డివిజన్లు: భీమునిపట్నం(కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి జిల్లా

జిల్లా కేంద్రం: అనకాపల్లి
మొత్తం మండలాలు: 24
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం, అనకాపల్లి

7. కాకినాడ జిల్లా

జిల్లా కేంద్రం: కాకినాడ
మొత్తం మండలాలు: 21
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ జిల్లా

జిల్లా కేంద్రం: అమలాపురం
మొత్తం మండలాలు: 22
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పు గోదావరి జిల్లా

జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
మొత్తం మండలాలు: 19
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమ గోదావరి జిల్లా

జిల్లా కేంద్రం: భీమవరం
మొత్తం మండలాలు: 19
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు జిల్లా

జిల్లా కేంద్రం: ఏలూరు
మొత్తం మండలాలు: 28
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు

12. కృష్ణా జిల్లా

కేంద్రం: మచిలీపట్నం
మొత్తం మండలాలు: 25
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు(కొత్త)

13. ఎన్టీఆర్‌ జిల్లా

జిల్లా కేంద్రం: విజయవాడ
మొత్తం మండలాలు: 20
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, నందిగామ (కొత్త), తిరువూరు (కొత్త)

14. గుంటూరు జిల్లా

జిల్లా కేంద్రం: గుంటూరు
మొత్తం మండలాలు: 18
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి

15. బాపట్ల జిల్లా

జిల్లా కేంద్రం: బాపట్ల
మొత్తం మండలాలు: 25
రెవెన్యూ డివిజన్లు : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు జిల్లా

జిల్లా కేంద్రం: నరసరావుపేట
మొత్తం మండలాలు: 28
రెవెన్యూ డివిజన్లు: గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం జిల్లా

జిల్లా కేంద్రం: ఒంగోలు
మొత్తం మండలాలు: 38
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

జిల్లా కేంద్రం: నెల్లూరు
మొత్తం మండలాలు: 38
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు , ఆత్మకూరు, కావలి, కందుకూరు

19. కర్నూలు జిల్లా

జిల్లా కేంద్రం: కర్నూలు
మొత్తం మండలాలు: 26
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల జిల్లా

జిల్లా కేంద్రం: నంద్యాల
మొత్తం మండలాలు: 29
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల, డోన్‌ (కొత్త), ఆత్మకూరు (కొత్త)

21. అనంతపురం జిల్లా

జిల్లా కేంద్రం: అనంతపురం
మొత్తం మండలాలు: 31
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి జిల్లా

జిల్లా కేంద్రం: పుట్టపర్తి
మొత్తం మండలాలు: 32
రెవెన్యూ డివిజన్లు : ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి (కొత్త), కదిరి

23. వైఎస్సార్‌ కడప జిల్లా

జిల్లా కేంద్రం: కడప
మొత్తం మండలాలు 36
రెవెన్యూ డివిజన్లు : కడప, జమ్మలమడుగు, బద్వేలు

24. అన్నమయ్య జిల్లా

జిల్లా కేంద్రం: రాయచోటి
మొత్తం మండలాలు: 30
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట, రాయచోటి(కొత్త), మదనపల్లి

25. చిత్తూరు జిల్లా

జిల్లా కేంద్రం: చిత్తూరు
మొత్తం మండలాలు: 31
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు, పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త), నగరి (కొత్త)

26. తిరుపతి జిల్లా

జిల్లా కేంద్రం: తిరుపతి
మొత్తం మండలాలు: 34
రెవెన్యూ డివిజన్లు : సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి (కొత్త)

Related posts