telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో మ‌రో ట్విస్ట్..

ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో మ‌రో ట్విస్ట్ నెల‌కొంది. పాత మంత్రులకు 5 మంది వరకు కొత్త కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించగా.. ప్రస్తుతం పాత మంత్రులు 10 మందికి సీఎం జగన్ మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

పాత టీమ్‌లో సీనియ‌ర్ల‌ను కొన‌సాగించేందుకు సీఎం రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. పనితీరు, కులాలు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేప‌థ్యంలో పాత‌వారికి కొన‌సాగించ‌బోతున్నారు. 

అయితే కొత్త మంత్రివర్గంలో చేరబోయేది ఎవరు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లాల వారీగా ఆశావాహులు తమకే మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు.

All set for AP Cabinet reshuffle on April 11

పాత మంత్రులు కొనసాగే జాబితా..

పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణకు, కొడాలి నాని, సీదిరి అప్పలరాజు, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల్, ఆదిమూలపు సురేష్, అంజాద్ భాషా, తానేటి వ‌నిత కొత్త కేబినెట్ లో మరోసారి అవకాశం లభించనున్నట్లు సమాచారం.

 

 

Related posts