ap and telangana have negative report on national health profile

ఆ వ్యాధుల వ్యాప్తిలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయట…

378

నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2018 విడుదల అయ్యింది. జాతీయంగా దేశీయుల ఆరోగ్య పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సదరు శాఖ వారు నివేదికను వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లలో లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడుతున్నట్టు తేల్చింది. దేశం మొత్తంలో ఈ రెండు రాష్ట్రాలు ఈ వ్యాధుల బారిన పడుతున్న వారిలో ప్రధమ స్థానంలో ఉన్నాయని తేల్చింది.

నివేదికల సమాచారం ప్రకారం 2016లో దాదాపు 8,056 మంది సిఫిలిస్ బారిన పడ్డారని ఇందులో ఒక్క తెలంగాణ నుండే 35 శాతం ఉండగా ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు 5, 155 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇదే సంవత్సరంలో గోనేరియా వ్యాధి బారిన పడిన రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. ఇదే వ్యాధి బారిన పడిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 2017లో ప్రధమ స్థానంలో ఉండగా, తెలంగాణ రెండవ స్థానంలో ఉంది.

కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఈ నివేదికను పలువురు వైద్యనిపుణులు వ్యతిరేకించటం గమనార్హం. రోబిటిక్ యూరోలాజిస్ట్ మరియు ఆండ్రొలోజిస్ట్ డా.కామెల్ల శ్రీధర్ మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చిన నివేదిక ఖచ్చితంగా నిజమేనని, ప్రస్తుత కాలంలో జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం(బాగా చెమట పట్టడం వల్ల ఏర్పడుతుంది), కండోమ్ వాడకపోవడం, లేదా సరిగా ఉపయోగించలేకపోవటం, స్వజాతి సంపర్కం వంటివి పెరిగిపోవటం చేత హెచ్.ఐ.వి. మరియు ఎస్.టి.డి. లు మునుపటికంటే 16 రేట్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని అన్నారు.

జాతీయ ఆరోగ్య నివేదిక ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు లైంగిక సంక్రమణ వ్యాధుల వ్యాప్తిలో ప్రధమ స్థానంలో ఉన్నది నిజమేనని వారు అన్నారు. ఏపీలో ఊబకాయం కూడా అధికం అవుతుందని తద్వారా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం లాంటి సమస్యలు, ఇక ఏపీలోని కోస్తా ప్రాంతంలో చెమటలు పెట్టె వాతావరణం ఉండటంతో జెనిటల్ హైజినిక్ (జననేంద్రియాలు చెమట వల్ల అపరిశుభ్రంగా ఉండటం) ఏర్పడుతుందని చెప్పారు, కానీ తమిళనాడులో ఎస్.టి.డి మరియు హెచ్.ఐ.వి. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో విజయం సాధించారని అన్నారు.

చర్మవ్యాధులు నిపుణులు డా.జార్జ్ వాల్సన్, శారద హాస్పిటల్, సైనిక్ పురి మాట్లాడుతూ, సిఫిలిస్ మరియు గోనొకోకల్ వ్యాధి బారిన పడిన వారు తరచూ వస్తుంటారని, దాదాపు ప్రతి వెయ్యి మందికి రెండు లేదా మూడు కేసులు ప్రతి నెలకు నమోదు అవుతున్నాయని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదైన కేసులప్రకారం గా ఉన్న లెక్కలేనని, దాదాపు 65 శాతం మంది ఏదొక ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతూనే ఉన్నారని అన్నారు.

ఒక్క 2017లోనే ఏపీలో 324మంది, తెలంగాణాలో 26 మంది ఇన్ఫెక్షన్స్ బారినపడి చనిపోయారని నివేదిక వెల్లడించింది.

http://www.cbhidghs.nic.in/index1.php?lang=1&level=2&sublinkid=88&lid=1138