తొలిసారిగా కెమెరా కంటికి చిక్కింది భారత క్రికెటర్ ముద్దులు తనయ వామిక.. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అనుష్క శర్మతో ఉన్న వామికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
2021, జనవరి 11న జన్మించిన వామికాని ఇప్పటి వరకూ ప్రపంచానికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చూపించలేదు. గతేడాది కాలంగా వామిక ముఖాన్ని మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అప్పుడప్పుడు ముఖం కనిపించడకుండా ఉన్న పాప ఫొటోలను పోస్ట్ చేశారు.
ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు ఎయిర్ పోర్ట్‌లో వామికా ఫొటో కోసం ఫొటోగ్రాఫర్లు తెగ ప్రయత్నించారు. మీడియా కంటపడకుండా అనుష్క వామికాను అదిమి పట్టడంతో చిన్నారి రూపం సగమే కెమెరాలకు చిక్కింది. అయితే ఫొటోగ్రాఫర్లపై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘దయచేసి.. పాప ఫొటో మాత్రం తీయకండి అని విజ్ఞప్తి చేశాడు.
ఈ క్రమంలోనే వామికా ఎలా ఉంటుందో అని అందరిలో ఆతృత నెలకొంది. తమ అభిమాన క్రికెటర్ ముద్దుల తనయను చూడాలని అభిమానులు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, తొలిసారిగా కోహ్లి కూతురు వామిక ఫస్ట్ ఫొటో వెలుగులోకి వచ్చింది.
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. అతని బ్యాటింగ్‌ని స్టేడియంలోని గ్యాలరీలో కూర్చుని అనుష్క శర్మ, వామిక వీక్షిస్తూ కనిపించారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగానే గ్యాలరీ వెలుపలికి వచ్చిన అనుష్క శర్మ.. కూతురుకి మైదానంలోని కోహ్లీని చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. అదే సమయంలో అటుగా కెమెరా కన్ను వెళ్లడంతో.. తొలిసారి వామిక కెమెరాకు చిక్కింది.
కోహ్లి కూతురు పుట్టిన తర్వాత అభిమానులు వామిక ఫోటో చూడటం ఇదే తొలిసారి. దీంతో వామిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5⃣0⃣ for Virat Kohli 👏 #SAvIND pic.twitter.com/kQUx0Ae0OK
— Doordarshan Sports (@ddsportschannel) January 23, 2022