telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా”లో గాయం… స్పందించిన అనుష్క

anushka

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సైరా” సినిమాలో అనుష్క ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. తాజాగా “సైరా” షూటింగ్‌కు కూడా హాజ‌రైంది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే అనుష్క కాలికి గాయ‌మైందని, నెల రోజులు విశ్రాంతి తీసుకోమ‌ని వైద్యులు సూచించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఆ వార్త‌ల‌పై అనుష్క ఫేస్‌బుక్ ద్వారా స్పందించింది. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సియాటిల్‌లో చిత్రీకరణలో పాల్గొంటున్నాను. లవ్యూ ఆల్‌” అంటూ అనుష్క ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇన్ని రోజులుగా ఆమె ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న రూమర్లకు చెక్ పడింది. “భాగ‌మ‌తి” త‌ర్వాత కొన్నిరోజులు గ్యాప్ తీసుకున్న అనుష్క ప్ర‌స్తుతం “సైరా”, “సైలెన్స్‌” సినిమాల్లో నటిస్తోంది. “సైలెన్స్” సినిమాలో అనుష్క మూగ అమ్మాయిగా నటిస్తోందని టాక్. ఇక ఈ చిత్రంలో మాధవన్ కూడా మరో ప్రధాన పాత్రలో కన్పించనున్నారు.

Related posts