అనుష్క నాలుగు పదులకు దగ్గర అవుతున్నా ఇంకా అదే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది. ఇటీవల ఆమెకు అవకాశాలు తగ్గినా వచ్చిన వాటిని మాత్రం సద్వినియోగం చేసుకుంటూనే ముందుకు దూసుకుపోతోంది. 2005 నుంచి నేటి వరకు ఏకంగా 14 సంవత్సరాల పాటు సౌత్‌ను ఏలేసిన ఆమె ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. దక్షిణాదిలో తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ సినిమా రంగాల్లో అందరు స్టార్ హీరోలతో నటించి హిట్లు కొట్టిన ఘనత అనుష్కదే. ఇక అనుష్కకు ఎప్పటి నుంచో ఓ కోరిక తీరకుండానే అలాగే మిగిలిపోయిందట. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న అనుష్కకు హాలీవుడ్ సినిమాల్లో నటించాలని చూస్తోంది. కానీ ఆమెకు ఎప్పుడూ ఈ అవకాశం రావడం లేదు.
అనుష్క ప్రస్తుతం సైలెన్స్, సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తోంది. బీ టౌన్‌లో ఓ వెలుగు వెలిగిన ప్రియాంకా, దీపికా పదుకునే ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు చేయగా లేటెస్ట్ గా శృతి హాసన్ కు హాలీవుడ్ వెబ్ సీరీస్‌లో నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలిసిందే. మరి అనుష్కకి హాలీవుడ్ ఛాన్స్ ఎప్పుడు వరిస్తుందో చూడాలి. ఆమె తల్లిదండ్రులు మాత్రం అనుష్కకు వెంటనే పెళ్లి చేసేయాలని త్వరపడుతున్నారట. అనుష్క ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలు రావడం… అవి పుకార్లుగానే మిగిలిపోవడం జరుగుతూ వస్తోంది.
భర్తను అవమానించిన వారికి గడ్డి పెట్టిన సింగర్ సునీత