telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అర్జున్ కపూర్ కి .. అనుష్క సమాధానం..

anushka kohli reply to arjun kapoor on

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సహ నటులను ఆటపట్టించడంలో ఎప్పుడూ ముందుంటాడు. బాలీవుడ్‌ నటీనటులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే పోస్టులను ట్రోల్‌ చేస్తూ సరదాగా ఆటపట్టిస్తుంటాడు. అర్జున్‌ ట్రోల్స్‌కు పాపం ఈ సారి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కశర్మ బలైయింది. అనుష్క తన ఇంట్లో బాల్కని వద్ద ఎండలో కుర్చుని టీ తాగుతున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేస్తూ.. ‘అలా సూర్యకిరణాల కింద టీ తాగుత్ను ఈ సన్నివేశం ఙ్ఞాపకంగా మిగిలిపోతుంది. నాకు ప్రియమైన వ్యక్తి ఈ ఫొటో తీశాడు’ అనే క్యాప్షన్‌తో ఆ ఫోటోని షేర్‌ చేసింది.

ఈ ఫొటోలో అనుష్క టీ షర్ట్‌, జాగర్‌ను ధరించి చేతిలో టీ కప్‌.. కాళ్లకు సాక్స్‌లు ధరించి ఉంది. అనుష్క పోస్టు చూసిన అర్జున్‌ తనదైన శైలిలో.. ‘సాక్స్‌ డ్రై వాష్‌ చేశావ్‌ మరి.. టాప్‌ చేశావా’ అంటూ కామెంట్‌ చేశాడు. అర్జున్‌ కామెంట్‌కు అనుష్క సైతం.. ‘బాస్‌ మనం సాక్స్‌ ఉతికేస్తామా’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చింది.

Related posts