telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కుమారస్వామి ప్రభుత్వానికి.. మరో గండం…రాజీనామా దిశగా ఎమ్మెల్యేలు..

CM Kumaraswamy killing order

ఎంతో నాటకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో కుమారస్వామి సీఎం పదవిని అధిష్టించారు. అయితే అప్పటి నుండి రోజుకో గండం అన్నట్టుగానే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పరిస్థితి ఉంది. కానీ, ఎన్ని సమస్యలు ఉన్నా కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని బయటకు చెపుతున్నా ఇప్పటివరకు దినదినగండంగా కొనసాగుతుంది. ఇప్పుడు మాత్రం కూలిపోక తప్పడం లేదు.. మరోపక్క ఇటువంటి అవకాశం కోసం బీజేపీ కాచుకుని కూర్చుందంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఉన్న పరిస్థితి ప్రకారం, కన్నడ రాజకీయాలు గత రెండు రోజులుగా పలు మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో మొదలైన వేడి మరింత రాజుకుంది.

కాంగ్రెస్‌లోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు నేడు రాజీనామా చేయనున్నట్టు వార్తలు గుప్పుమనడంతో మరోసారి కలకలం రేగింది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితి ‘నియంత్రణ’లోనే ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారంటూ కాంగ్రెస్-జేడీఎస్ చేసిన ఆరోపణలపై బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప స్పందించారు. అధికార పార్టీనే ఆ పనిచేస్తోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి తమవైపు తిప్పుకుంటోందంటూ ఆయన వెల్లడించారు.

Related posts