telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆచార్య”లో రామ్ చరణ్ బదులు మరో హీరో…!?

Ram-Charan

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. అయితే ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్న రామ్‌చరణ్‌ రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో ఆచార్య చిత్రానికి డేట్స్‌ సర్దుబాటు అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సమయంలో మెగాస్టార్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఆచార్యలో చరణ్ కోసం అనుకున్న పాత్రను మరో హీరోతో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొరటాల శివ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని టాక్.

Related posts