దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. చిత్ర పరిశ్రమలో పలు సినిమాల చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు తమ కుంటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్‌కపూర్ తన భార్య సునితా కపూర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కపూర్ మాట్లాడుతూ ‘నన్ను పెళ్లి చేసుకోవాలని సునితకు ప్రపోజల్ పెట్టినప్పుడు, మేరీ జంగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే సునితా పెళ్లికి ముందే నాకు ఇల్లు ఉండాలి, వంట మనిషి ఉండాలని కొన్ని నిబంధనలు పెట్టారు. అనంతరం ఇళ్లు, వంట గది, వంటకు సాయం చేసే మనిషి కూడా ఉంటుందని చెప్పాను. అనంతరం మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత నేను మూడు రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లాను. కానీ మా మేడం మాత్రం నేను లేకుండా ఒక్కతే హనీమూన్‌కు విదేశాలకు వెళ్లింది అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇక నా కూతురు రియా కపూర్ మంచి కుక్, సోనమ్ కపూర్ కూడా వంట చేయటంలో ఆసక్తిని కనబరుస్తోంది’ అని అనిల్ కపూర్ సరదాగా చెపుకొచ్చారు. అనిల్ కపూర్, సునితా కపూర్ వివాహం జరిగి 35 ఏళ్లు అవుతోంది. వీరికి రియా, సోనమ్‌తోపాటు కుమారుడు హర్షవర్ధన్ కపూర్ ఉన్నారు. సోనమ్, హర్షవర్ధన్ నటనలో కొనసాగుతుండగా, రియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సోనమ్‌కపూర్ చాక్లెట్ వాల్‌నట్ కేకు తయారు చేసిన ఓ ఫోటోను తన ఇన్‌స్ట్రామ్‌లో షేర్ చేశారు.
previous post