అంకుడు కర్రలు సహజసిద్ధ రంగులు అద్ది తయారు చేసే ఏటికొప్పాక లక్క బొమ్మలకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.
ఇక్కడి కళాకారుడు రూపొందించిన బొమ్మల సమూహం నమూనా గణతంత్ర దినోత్సవ శకటంగా మారింది. ఆంధ్రప్రదేశ్ తరపున ఢిల్లీలో ప్రదర్శన చేయబోతోంది.
ఏపీ తరపున ఢిల్లీ కర్తవ్య పథ్ లో 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్ ఈసారి ఏపీకి ప్రత్యేకత.
దాంతోపాటు అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారులకు అరుదైన గుర్తింపు. ఎందుకంటే 16 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు 10 కేంద్ర ప్రభుత్వ శాఖలో పాల్గొనే గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఏపీ తరపున ఏటికొప్పాక లక్క బొమ్మల శకటం పాల్గొంటుంది.
ఇందులో వివిధ రాష్ట్రాల్లో తమ శకటాలను వేరువేరు రూపాల్లో ప్రదర్శిస్తారు.
వాస్తవానికి శతాబ్దల చరిత్ర కలిగింది ఏటి కొప్పాక లక్క బొమ్మలు. అంకుడుకరణ ఉపయోగించి చేతితో బొమ్మలు తయారుచేయడం ఇక్కడి ప్రత్యేకత.
వాటికి సహజ సిద్ధ రంగులు అద్ది లక్క పెట్టి ఈ బొమ్మలకు జీవం పోస్తుంటారు అక్కడి కళాకారులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు కూడా గెలుచుకున్నాయి ఈ బొమ్మలు.
మనకి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2017లో ఈ బొమ్మలకు జిఐ విశిష్ట గుర్తింపు కూడా దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మలకు ప్రత్యేక ఉంది.
పర్యావరణ ఫ్రెండ్లీగా ఉండడంతోపాటు చిన్నపిల్లలు ఆడుకున్న ఎటువంటి హాని చేయని విధంగా ఉంటాయి.
కరీంనగర్ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది : ఈటల