telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు!

school teachers class

లాక్ ‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెలవులను పొడగించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్‌ చిన వీరభద్రుడు ఓ సర్క్యులర్ ను‌ జారీ చేశారు. వాస్తవానికి 2019-20 విద్యా సంవత్సరం రేపటితో ముగియాల్సివుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, పరీక్షలు జరపకుండానే సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మరోసారి పొడిగించబడింది. దీంతో సెలవులను కూడా పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.మే 3 తరువాత పరిస్థితిని సమీక్షించి, ఓ నిర్ణయానికి వస్తామని విద్యా శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఏపీలో ఇంటర్, టెన్త్ విద్యార్థుల పరీక్షలు ఇంకా జరగలేదు. మిగతా తరగతుల వారికి మాత్రం హాజరు ఆధారంగా పై తరగతులకు ప్రమోషన్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related posts