telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విద్యార్థులకు గుడ్ న్యూస్‌..

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నగదును వద్దనుకున్న వారికే ల్యాప్ టాప్ లు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో టెండర్ల ప్రాసెస్ ప్రారంభించింది.

రాష్ట్రంలో పేద విద్యార్థులకు వారి సమ్మతిని అనుసరించి ‘జగనన్న అమ్మఒడి’, ‘జగనన్న వసతి దీవెన’ స్థానంలో ల్యాప్‌టాప్‌లు అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్‌ను డిజిటల్‌ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Jagan announces laptop in lieu of DBT for students of IX to XII - The Hindu

ఈ క్రమంలో ప్రాథమిక స్థాయి కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌ల కొనుగోలు చేయాలని భావిస్తోంది. లేటెస్ట్ కాన్ఫిగరేషన్‌తో 90,926 ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్ ఆహ్వానిస్తోంది. ల్యాప్‌టాప్‌ల సరఫరాకు బిడ్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఆహ్వానించింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు టెండరు విలువ వంద కోట్ల రూపాయల పరిమితి దాటడంతో టెండరు నోటీసులోని అంశాలను న్యాయసమీక్షకు పంపించింది.

ఈ నెల 17 లోగా అభ్యంతరాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం కోరింది. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా ఏపీ జ్యూడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్​కు ఈ అభ్యంతరాలు, సూచనలు సలహాలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా పథకాల నగదుకు బదులు ల్యాప్‌టాప్‌లు అందుకున్న విద్యార్థులు.. వాటిలో ఏమైనా లోపాలు తలెత్తితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో ఆయా కంపెనీలు సమస్యను పరిష్కరించాలి. వీటికి మూడేళ్ల వారెంటీ ఉంటుంద‌ని తెలిపింది.

Related posts