తెలంగాణలోని ముచ్చింతల్లో నిర్వహిస్తున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. అక్కడ రామానుజ ఆశ్రమాన్ని సందర్శించారు. శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు .సమతామూర్తి మూర్తి విగ్రహాన్నిభావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారని జగన్ అన్నారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా రామానుజాచార్యులు పోరాడారని గుర్తు చేసుకున్నారు.
ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామికి జగన్ అభినందనలు తెలిపారు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకు సమతామూర్తిని స్థాపించారన్నారు. సమతామూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
అనంతరం సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని సీఎం జగన్ దర్శించుకున్నారు. విగ్రహ విశేషాలను చినజీయర్ స్వామి సీఎం జగన్‌కు వివరించారు.