telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనసూయపై దారుణంగా… సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోల కలకలం

Anasuya

తెలుగులో వస్తున్న “జబర్ధస్త్” కామెడీ షోతో యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఒకవైపు బుల్లితెర షోలు, మరోవైపు సినిమాలు అంటూ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది. అనసూయ యాంకర్ గా పాపులారటీతో పాటు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. అనసూయ పేరుతో అశ్లీల పోస్ట్ లు పెడుతూ, బూతు పదజాలం ఉపయోగించిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. వాటిని గుర్తించిన ప్రోగ్రెసివ్ యూత్ నాయకులూ సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో యాప్‌ల ద్వారా అశ్లీలాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసీవ్ యూత్ లీగ్ కార్యదర్శి ప్రదీప్ ఆదివారం సీసీఎస్ సైబర్‌క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనసూయ భరద్వాజ్ యాంకర్ ఫ్యాన్స్ గ్రూపు పేరుతో అచ్చం అందం, తెలుగు బ్యూటీ, ఆంధ్రాపోరీలు, అదుర్స్ అంటూ ఫేసుబుక్‌లో గ్రూపులను సృష్టించి బూతు వీడియోలు ప్రత్యక్షంగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ప్రదీప్ పేర్కొన్నారు. షేర్ చాట్, విడ్ స్టాటస్, స్టాటస్ వీడియోస్, స్టాటస్ డౌన్ లోడర్ యాప్‌ల ద్వారా సభ్యులను చేర్చుకుంటూ అశ్లీలాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ అభ్యంతకర పోస్టింగ్‌లను చేస్తున్నవారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రదీప్, కృష్ణ, అంజి, దిలీప్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts