telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సునీల్‌తో రొమాన్స్‌ చేయనున్న అనసూయ?

Anasuya

సునీల్ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన కామెడీ టైమింగ్‌తో అందరిని అలరించి ప్రఖ్యాత హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. దాదాపు కొన్న దశాబ్దాలుగా అగ్ర హాస్య నటుడిగా ఉన్న సునీల్ కొన్నాళ్ల క్రితం ట్రాక్ మార్చాడు. కమెడియన్ ట్రాక్ నుంచి హీరోగా మారాడు. రాజమౌళి సినిమా ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగా భారీ హిట్ అందుకున్న సునీల్ తరువాత హిట్ అన్న పేరుకు ఆమడ దూరంలో ఉన్నాడు. దాంతో మళ్లీ కమెడియన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. అయినప్పటికీ హీరోగా చేసేందుకు అడపతడప అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల సునీల్‌కి హీరో అవకాశం వచ్చింది. ఇటీవల సీ చంద్రమోహన్ దర్శకత్వంలో హీరోగా చేసేందుకు సునీల్ ఓకే చెప్పాడు. దీనికి ‘వేదాంతం రాఘవయ్య’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇటీవల పూజాకార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో సునీల్ సరసన నటించేది ఎవరన్న సందేహాలు వచ్చాయి. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా సునీల్ సరసన జబర్దస్త్ ఫేమ్ అనసూయను ఎంపిక చేయనున్నారట. ఇప్పటికే రంగమ్మత్తను చిత్రయూనిట్ సంప్రదించిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో చేసేందుకు రంగమ్మత్త ఓకే చెప్పిందట. సునీల్, అనసూయ అంటే చాలా క్రేజీ కాంబో అని అభిమానలు భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అతి త్వరలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్ర టీం అంటుందోంది.

Related posts