telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆనందయ్య మందుపై ఈరోజు హైకోర్టు తీర్పు చెప్పే అవకాశం…

ఇప్పుడు ఎక్కడ చుసిన ఆనందయ్య కరోనా మందుపై చర్చ నడుస్తుంది. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రేపు అనుమానమే అంటున్నారు. ఆనందయ్య మందు ఆయుర్వేద మందు కాదంటు సిసిఆర్ఏఏస్ తేల్చేసినట్లు సమాచారం. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రాష్ట్ర పరిధిలో జారి చేసే అవకాశం వుండగా… కేంద్ర పరిధిలోకి ఎందుకు వచ్చారంటు అనుమానం వ్యక్తం చేసింది సిసిఆర్ఏఏస్. ఆనందయ్య మందు పంపిణీ అంశాని ఆయూష్ కి నివేదించనుంది సిసిఆర్ఏఏస్. చిక్కు ముడులు విడి…. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు వచ్చే అవకాశం ఇప్పట్లో లేనట్లే అంటున్నారు నిపుణులు. అయితే ప్రస్తుతం ఏ మందు పంపిణీ ప్రభుత్వం నిలిపివేయడంతో… దానికి వ్యతిరేకంగా హైకోర్టులో రెండు పిటిషన్ లు నమోదయ్యాయి. ఇక ఈరోజు హైకోర్టులో ఆనందయ్య మందుపై విచారణ జరగనుంది. అయితే మందు పంపిణీ విషయంలో హైకోర్టు ఈ రోజు తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఈ మందు పంపిణీ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts