కనీస అవసరమైన ఆధార్ కార్డుకు దూరంగా గిరిజనులు, గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని పైనాపురం పంచాయతీలో రెండు గిరిజన కాలనీలున్నాయి చిన్న సంఘం కాలనీలో 88 మందికి ఆధార్ కార్డులు, 60 కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు, 19 మందికి అర్హత ఉన్నా పింఛన్ రావడం లేదు అన్నారు.
తోటపల్లిగూడూరు మండలం మాచర్లవారిపాళెం సచివాలయం పరిధిలో మాచర్లవారిపాళెం, మల్లికార్జునపురం ఉన్నాయి రెండు గ్రామాల్లో కలిసి 180 మందికి ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డులు లేక అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పేదలు దూరమవుతున్నారు అన్నారు .
కలెక్టర్ తో పాటు ఐటీడీఏ అధికారులు, ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించాం, సచివాలయ ఉద్యోగులు ఐదేళ్లు కార్యాలయాలకు పరిమితమై ప్రజల సమస్యలపై దృష్టి పెట్టలేదు అని అన్నారు.
పేదల కోసం ఒక్కో సచివాలయం పరిధిలో 11 మందికి ప్రభుత్వం ఉద్యోగాలిస్తే ప్రజల కనీస అవసరాలను పట్టించుకోరా అని ప్రశ్నించాం అన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి ఆధార్ కార్డులు లేని వారి వివరాలను సేకరించడంతో పాటు వారికి ఆధార్ నంబర్ జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించాం అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో సుమారు 40 వేల మందికి పైగా గిరిజనులున్నారు..ఆధార్ కార్డులు లేని వారిలో 90 శాతం మంది గిరిజనులే అన్నారు.
ప్రతి పంచాయతీ పరిధిలో 100 శాతం మంది ఆధార్ కార్డులు పొందేలా లక్ష్యం పెట్టుకుని ముందుకెళుతున్నాం అన్నారు.
అమాయకులు, నిరక్షరాస్యులైన గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా పెద్దలు లాగేసుకుంటున్నారు .
గత ఐదేళ్లలో గిరిజనులకు జరిగిన అన్యాయాలపై విచారణ జరిపి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రసంగించారు.