ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పి.అముద నియమితులయ్యారు. ఆమెను జాయింట్ సెక్రెటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా 16 మంది అధికారులను మార్చారు. కొత్తగా వివిధ రీజియన్లు, కేటగిరీలకు ఐఏఎస్ లను బదిలీ చేశారు.
1994 తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారిణి అముద ప్రస్తుతం లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రొఫెసర్ గా విధులను నిర్వహిస్తున్నారు. అతి త్వరలోనే ఆమె ప్రధాని కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ బుజ్జగింపు రాజకీయాలు: అమిత్షా