గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని తెలంగాణ సర్కారు నియమించింది.
ఈమేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆమ్రపాలితో పాటు మొత్తం 44 మంది ఐఏఎస్ లకు రేవంత్ రెడ్డి సర్కారు స్థానచలనం కల్పించింది.
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.