telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అత్యాచారం తప్పదనప్పుడు దాన్ని ఎంజాయ్‌ చేయటమే… అమితాబ్ వ్యాఖ్యలు వైరల్

Amitab

హైదరాబాద్‌లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్‌ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై సినీ ప్రముఖులు సైతం తీవ్రంగా స్పందించారు. అయితే బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇలాంటి సంఘటనకు సంబంధించి గతంలో చేసిన ఓ కామెంట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. 1990లో విడుదలైన `మూవీ` అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద ఓ వార్తను పబ్లిష్ చేశారు. `అత్యాచారం తప్పదనప్పుడు.. వెనక్కి పడుకొని దాన్ని ఎంజాయ్‌ చేయటమే` అంటూ అమితాబ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇబ్బందులు పాలు చేయనున్నాయా? అన్నది ఆ వార్త సారాంశం. అయితే అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో తెలియదుగానీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అమితాబ్‌ చేసిన ఆ కామెంట్‌ వైరల్‌ అవుతోంది. తాజాగా దిశ ఘటన తరువాత అమితాబ్‌ వ్యాఖ్యలను తెర మీదకు తీసుకువచ్చిన కొంత మంది నెటిజెన్లు, బాలీవుడ్ సూపర్‌ స్టార్లే ఇలా మాట్లాడుతుంటే ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది అని వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts