telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్ షాకింగ్ నిర్ణయం… రిటైర్మెంట్ ?

Amitab

బాలీవుడ్ మెగాస్టార్ 78 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 200కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలు చేసిన ఈ అరుదైన నటుడికి ఇటీవలే ప్రతిష్ఠాత్మక “దాదాసాహెబ్‌ ఫాల్కే” అవార్డు దక్కిన విషయం తెలిసిందే. 78 ఏళ్ల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం `బ్రహ్మాస్త్ర` షూటింగ్‌లో పాల్గొంటున్న అమితాబ్ తాజాగా తన బ్లాగ్‌లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అమితాబ్ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. “నా మనసు ఉత్సాహంగానే ఉన్నా శరీరం సహకరించడం లేదు. నా మైండ్ ఒక విధంగా ఆలిచిస్తూంటే నా చేతులు మరొకటి చేస్తున్నాయి. నేను రిటైర్మెంట్ తీసుకోవాలి” అని అమితాబ్ పేర్కొన్నారు. దీంతో అమితాబ్ సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారనే చర్చ మొదలైంది.

Related posts