బాలీవుడ్ అగ్రనటులలో అమితాబచ్చన్ ఒకరు. ఇప్పటికి ఆయన నటనతో మెప్పిస్తూనే ఉన్నాడు. నేటివరకూ నటుడిగా అమితాబ్ ప్రయాణం కొనసాగుతూనే వుంది. కెరియర్లో ఎన్నో అవాంతరాలను నవ్వుతూనే అధిగమించిన ఆయన, ఈ రోజున బాలీవుడ్ కి పెద్ద బాలశిక్షగా నిలిచారు. తరాలు మారుతున్నా .. కొత్త హీరోలు వస్తున్నా ఆయన స్థానం సుస్థిరంగా ఉంటూ వచ్చింది. అలాంటి అమితాబ్ నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు.
నటుడిగా సుదీర్ఘమైన ఆయన ప్రయాణంలో ఎన్నో అద్భుత చిత్రాలు మైలురాళ్లుగా కనిపిస్తాయి. నటుడిగా ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సన్నిహితులంతా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ .. “50 యేళ్ల క్రితం ఇదే రోజున ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ రోజుకీ ఆయనకి తన పని పట్ల నిబద్ధత ఎంత మాత్రం తగ్గలేదు. విషెస్ చెబుదామని నేను ఆయన రూమ్ కి వెళితే తయారవుతున్నారు .. ‘ఎక్కడికి నాన్న?’ అంటే ‘పనికి’ అంటూ సమాధానం ఇచ్చారు. అందుకే ఆయన నా మార్గదర్శకుడు .. విమర్శకుడు’ అని ట్వీట్ చేశాడు.
ప్రభాస్ నా కొడుకు… అనుష్క కామెంట్స్ వైరల్