telugu navyamedia
రాజకీయ వార్తలు

అమిత్ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

amith shah bjp

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీప్ అర్వింద్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భద్రత ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు.తీర్పు వచ్చాక అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది.

Related posts