telugu navyamedia
రాజకీయ వార్తలు

సీఏఏకు వ్యతిరేకంగా భారీ కుట్ర: అమిత్ షా

amith shah bjp

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కు వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు లక్నోలో సీఏఏకు మద్దతు తెలుపుతూ చేసిన ర్యాలీలో షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ చట్టంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీలు ఎక్కడ కోరుకుంటే అక్కడ చర్చకు తాము సిద్ధమని అమిత్ షా సవాల్ విసిరారు.

సీఏఏను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోమన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలంటున్న ‘తుక్డే తుక్డే’ సమూహానికి కాంగ్రెస్ మద్దతిస్తోందని పేర్కొన్నారు. భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తే జైలుకేనని తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకే రీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు.. దేశంలో కాంగ్రెస్ అల్లర్లను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. మూడు నెలల్లో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని తెలిపారు.

Related posts