telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

జమ్మూ కాశ్మీర్ లో .. అమెరికా పౌరులు పర్యటించవద్దు.. : ట్రంప్ హెచ్చరిక

trump new policies on h1b visa

జమ్మూ కాశ్మీర్ లో అమెరికా పౌరులెవరూ పర్యటించవద్దని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్‌ ఉగ్రస్థావరంపై భారత్‌ వైమానికి దాడులు చేయడంతో భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అందుకే అమెరికన్లను హెచ్చరిస్తున్నామని అన్నారు. తూర్పు లడఖ్‌ ప్రాంతం, లేహ్‌ మినహా కాశ్మీర్‌లోని ఏ ప్రదేశానిక వెళ్లొద్దని అమెరికా ట్రావెల్‌ అడ్వైజరీ సూచించింది.

ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా భారత్‌ భద్రతా దళాలు కాల్పులు కొనసాగిస్తున్నందున సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోనే ఆగిపొవాలని ఆదేశించింది. ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండా పర్యాటక ప్రాంతాలు, రవాణా ప్రాంగణాలు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తారని ట్రావెల్‌ అడ్వైజరీ పేర్కొంది.

Related posts