telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆమె ఓ భయంకరమైన మహిళ: డొనాల్డ్ ట్రంప్

trump usa

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి సెనేటర్ కమల హారిస్ ఎంపికపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెనేటర్ కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ భయంకరమైన మహిళ అని వ్యాఖ్యానించారు.

ప్రైమరీల స్థాయిలో నామినేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడే ఆమె అసమర్థత వల్ల తనను ఆకట్టుకోలేదని, ఆమె బలహీనతలను చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. సెనేట్‌లో ఆమె అంతటి అగౌరవనీయమైన వ్యక్తి మరెవరూ లేరని ట్రంప్ అన్నారు . అటువంటి మహిళను జో బిడెన్ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.

Related posts