telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కరోనాతో అల్లాడుతున్న అగ్రరాజ్యం..న్యూయార్క్‌లో 10 వేల మరణాలు!

corona america

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అల్లాడుతోంది. అమెరికాలో ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు వదులుతున్నారు. దేశంలోనే తొలిసారి మంగళవారం అత్యధికంగా 2,129 మందిని ఈ వైరస్ బలితీసుకుంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 26 వేలు దాటిపోయింది. ఈ మరణాల్లో సగం న్యూయార్క్‌ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. ఇక్కడ మంగళవారం వరకు 10,367 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ లెక్కలు తప్పని ఒక్క న్యూయార్క్ నగరంలోనే 10 వేల మందికిపైగా చనిపోయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం మంగళవారం నాటికి ఇక్కడ మృతి చెందింది 6,589 మంది మాత్రమేనని చెబుతోంది. కోవిడ్-19, లేదంటే మరో వ్యాధి కారణంగా మరో 3,778 మంది మృతి చెందారని, వారిని ఈ లెక్కల్లో కలపలేదని న్యూయార్క్ ఆరోగ్య కమిషనర్ ఆక్సిరిస్ బార్బోట్ తెలిపారు. వారిని కూడా కలిపితే మృతుల సంఖ్య పదివేలు దాటుతుందన్నారు.

Related posts