కరోనా వైరస్ విజృంభిచడంతో అమెరికా అల్లాడిపోతోంది. ఆ దేశంలో కోవిడ్ నిర్ధారిత కేసుల సంఖ్య నిన్నటికి లక్ష (1,01,000) దాటేసింది. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 8 వేలే కావడం గమనార్హం. గురువారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 16,877 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 1588 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 402 మంది మృతి చెందారు.
న్యూయార్క్, వాషింగ్టన్‌లలో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. చికాగో, డెట్రాయిట్, న్యూ ఓర్లీన్స్‌లలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తమ వద్ద తగినంత వైద్య వనరులు లేవని దేశవ్యాప్తంగా 213 నగరాల మేయర్లు చేతులెత్తేశారు. బాధితులను రక్షించేందుకు అవసరమైన పరికరాలను పొందే మార్గం కానీ, సరఫరా కానీ లేదని పేర్కొన్నట్టు శుక్రవారం విడుదలైన ఓ సర్వే వెల్లడించింది.
టూరిజం బోట్లలో మంత్రులకు వాటాలు: మాజీ ఎంపీ హర్షకుమార్