telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

నేడు శాంతి పాటపాడుతున్న .. అమెరికా, నాడు ఏమైందో ఈ పాట..!!

trump intermediate on india and pakistan

ఇటీవల అమెరికా భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తుంది. నాడు తన భూభాగంలో రెండు టవర్లు పేల్చగానే ఒక దేశంపై యుద్దాన్ని తలపించే దాడులు చేసిన విషయం గుర్తులేదేమో..నేడు మాత్రం శాంతి పాట పడుతుంది. అంతేగా, ఎవరి బాధ వారికే తెలుస్తుంది. స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళలో భారతసైన్యం, పౌరులు ఎంతమంది ఉగ్రభూతం వలన మరణించారో లెక్కలు వేస్తె, బహుశా బొటాబొటీనా ఒక జిల్లా జనాభాను భారత్ కోల్పోయి ఉంటుంది. అయినా దాయాది దేశంలో మార్పు వస్తుందేమో అని ఎదురుచూస్తూనే ఉంది.

కానీ ఇప్పుడు కూడా ఆగితే దేశప్రజలే ప్రభుత్వాన్ని క్షమించరు.. ప్రజలే స్వయంగా యుద్దానికి బయలుదేరుతారు.. అలాంటి పరిస్థితులలో అగ్రరాజ్యం తమ మీదకి ఏమైనా బాంబులు పడతాయని బయపడుతుందేమో.. లేక మరొకటో.. శాంతి పాఠం చెపుతుంది. ప్రపంచానికి శాంతిని బోధించిన భారత్ కు ఒకడి దగ్గర ఆ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ, అగ్రరాజ్యం శాంతి పాట వెనుక కూడా ఏదో కుటిల రాజకీయం ఉండే ఉంటుంది. అందుకే అంత తాపత్రయ పడుతుంది. మొత్తానికి మరోసారి బుద్ది చూపించుకుంటుంది.

మొసలి కన్నీరు కారుస్తూ, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అంటూ అమెరికా ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదం. తన ఉనికి చాటుకోడానికే ఈ ప్రయత్నాలు. భారత్-పాక్‌లకు ఫోన్ చేసిన అమెరికా ప్రభుత్వం ఇరు దేశాలు సంయమనం పాటించాలని, మిలటరీ చర్యలను నిలుపుదల చేయాలని సూచించింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను తక్షణం తీసుకోవాలని కోరింది. ఇందులో భాగంగా ఇరు దేశాలు నేరుగా మాట్లాడుకోవాలని సూచించింది.

భారత సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి వంటి సీమాంతర ఉగ్రవాదం ప్రాంతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పాక్‌కు ఫోన్ చేసి చెప్పామని, ఉగ్రవాదులకు తమ భూభాగాన్ని స్వర్గధామంగా మార్చొద్దని, వారి నిధుల సరఫరాకు అడ్డుకట్ట వేయాలని పాక్‌కు సూచించినట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

Related posts