దేశంలో రెండు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. తదుపరి దశల్లో జరగబోయే ఎన్నికల కోసం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ప్రచార వనరులను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న ప్రముఖులు సైతం వీరికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబయి కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దియోరాకు దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కొందరు మద్దతుగా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, కొటక్ మహీంద్రా బ్యాంకు చెందిన ఉదయ్ కొటక్ తదితరులు మిలింద్‌కు మద్దతుగా మాట్లాడుతున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ వీడియోలో .. ‘మిలింద్ దక్షిణ ముంబయికి చెందిన వ్యక్తి. ఆయనకు పదేళ్లు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది. ఆయనకు ఇక్కడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను’ అని ముకేశ్ అంబానీ అన్నారు. దక్షిణ ముంబయికి చెందిన నిజమైన ప్రజా ప్రతినిధి’ అని ఉదయ్ కొటక్ అన్నారు. వీరితో పాటు ప్రముఖ వ్యాపార వేత్తల నుంచి చిన్న వ్యాపారుల వరకూ మిలింద్‌కు మద్దతిస్తున్న వీడియోను మిలింద్ ట్విటర్‌లో పంచుకున్నారు. ఏప్రిల్ 29న ఇక్కడ పోలింగ్ జరగనుంది.
దేశ వ్యాప్తంగా హింస పెరిగిపోతోంది: రాహుల్