telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

కుబేరుల జాబితా :.. మొదటి స్థానంలో అమెజానే .. మూడో స్థానానికి పరిమితమైన బిల్ గేట్స్..

ప్రపంచ ధనికుల జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు. ఆ స్థానంను బెర్నార్డ్ అర్నాల్ట్ ఎగబాకాడు. తొలిస్థానంను మాత్రం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలుపుకున్నాడు. రెండో స్థానం కైవసం చేసుకున్న అర్నాల్ట్ ఎల్‌వీఎమ్‌హెచ్ మోయెట్ హెన్నెస్సీ- లూయిస్ విటన్ ఎస్ఈ, ఏకేఏ ఎల్‌వీఎమ్‌హెచ్ సంస్థకు ఛైర్మెన్ మరియు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అర్నాల్ట్‌కు సంబంధించిన సంపాదన ఆస్తుల వివరాలు ఎల్‌వీఎమ్‌హెచ్ సబ్మిట్ చేసింది. ఆయన నికర ఆదాయం 108 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఒక్క 2019లోనే అర్నాల్ట్ 39 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఆ సంస్థ పేర్కొంది. బ్లూంబర్గ్ విడుదల చేసిన ప్రపంచంలోని 500ల ధనికుల జాబితాలో ఒక వ్యక్తి ఒక ఏడాది సంపాదనలో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు అర్నాల్ట్.

అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఇంకా తొలి స్థానంలో కొనసాగుతున్నట్లు బ్లూంబర్గ్ సంస్థ తెలిపింది. ఆయన ఆస్తుల నికర విలువ 125 బిలియన్ డాలర్లుగా ప్రకటించింది. రెండో స్థానం నుంచి బిల్ గేట్స్ మూడో స్థానంకు పడిపోయారు. అతని నికర విలువ 107 బిలియన్ డాలర్లుగా ఉందని బ్లూంబర్గ్ సంస్థ వెల్లడించింది. ఈ ముగ్గురు ఆస్తుల విలువ కలిపితే ఎస్‌&పీలో నమోదైన 500 లిస్టెడ్ కంపెనీల ఆస్తుల విలువ కూడా సరితూగడం లేదని పేర్కొంది. ఈ లిస్టెడ్ కంపెనీల్లో వాల్‌మార్ట్, ఎక్సాన్ మోబిల్ కార్ప్, వాల్ట్ డిస్నీలాంటి సంస్థలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బిల్‌గేట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమైనందున రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయినట్లు తెలుస్తోంది. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు 35 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. అలా విరాళంగా ఇచ్చి ఉండకపోతే బిల్‌గేట్స్‌ ఇంకా రెండో స్థానంలో కొనసాగేవారని బ్లూంబర్గ్ పేర్కొంది.

Related posts