telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్

 

తెలుగు చిత్ర పరిశ్రమలో నవ్వుల పూలు పూయించిన వ్యక్తి అల్లు రామలింగయ్య. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య హాస్యం ఏ తీరున ప్రత్యేకమైనది. అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. బాల్యం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ సాగారు. 1970లలో రూపొందిన వందలాది చిత్రాలలో అల్లు రామలింగయ్య నవ్వులు పూయించారు. ఒకే రోజున నాలుగు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నవ్వులు పండించేవారు.

ఈ రోజు అల్లు రామలింగయ్య శత జ‌యంతి. ఈ సందర్భంగా అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్‌ కలిసి వారి తాత, లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు కుటుంబానికి హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన కోకాపేట్ ప్రాంతంలో భూమి ఉంది. అక్కడ గత సంవత్సరం అల్లు స్టూడియోస్ నిర్మాణానికి సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ లో పాల్గొంటాడని అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అల్లు బ్రదర్స్ ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. “ఆయన మా గర్వం. అల్లు స్టూడియోస్‌లో మా ప్రయాణంలో భాగం అవుతారు” అని అల్లు అర్జున్ చెప్పాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

 

Related posts