telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అల వైకుంఠపురంలో” ఖాతాలో మరో అరుదైన రికార్డు

AY

దర్శకుడు త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అల వైకుంఠపురంలో మూవీ భారీ విజయం అందుకుంది. బన్నీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేయడం విశేషం. ఈ మూవీలో బన్నీకి జంటగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ సాంగ్స్ జియో సావన్ లో ఏకంగా 200 మిలియన్ ప్లేస్ (Plays) దక్కించుకొని అరుదైన రికార్డు నెలకొల్పాయి. ఓ ప్రాంతీయ భాషా చిత్ర సాంగ్స్ కి ఈస్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. చాలా కాలం తరువాత థమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.

Related posts