telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ …. “పుష్ప” కానుక..

సౌతిండియా స్టైలిష్ స్టార్, ఐకానిక్ హీరో అల్లు అర్జున్ అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. అభిమానులకు కిక్కెక్కించే వార్తను పుష్ప సినిమా టీమ్ అందించింది. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షక, అభిమానులకోసం ఈనెల ఆరోతేదీన సర్‌ప్రైజ్‌ను అందించనున్నట్టు సినిమా బృందం హింట్ ఇచ్చింది. ఆ హంగామా ఎలా ఉంటుందో ‘ట్రైలర్‌ టీజ్‌’ పేరుతో రుచి చూపించింది. 26 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోతో సినిమాలోని కీలక పాత్రల్ని, థీమ్‌ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

అయితే ఆ దృశ్యాలన్నీ అత్యంత వేగంగా సాగుతాయి. ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారో వివరిస్తూ ట్రైలర్ విడుదల కాబోతోంది సంకేతాలిచ్చారు. ‘పుష్ప’ సినిమా తొలిపార్టుకు సంబంధించిన ట్రైలర్ ఆరోతేదీన అల్లు అభిమానులకు అందిస్తారు.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు పార్టులు గా విడుదల చేస్తున్నారు. రష్మిక మందాన కథానాయిక. సునీల్‌, ఫాహద్‌ ఫాజిల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా తొలిభాగం ఈనెల 17తేదీన తెలుగు రాష్ట్రాలు తో పాటు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అమెరికాలో విడుదలకానుంది.

Related posts