telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరోజ్ ఖాన్ మరణం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు : అల్లు అర్జున్

Saroj-KHan

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ‘మాస్టర్ జీ‌, ‘మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ’ అని అంతా ప్రేమగా పిలిచే ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండె పోటుతో శుక్రవారం క‌న్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరోజ్ ఖాన్ మృతికి సంతాపం ప్ర‌క‌టిస్తూ ఆమె కుటుంబ సభ్యులుకు, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. అలానే స‌రోజ్ ఖాన్‌తో కలిసి ‘డాడీ’ సినిమా కోసం పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన సినీ కెరీర్‌కు తొలి కొరియోగ్రాఫర్‌గా సరోజ్ ఖాన్ వంటి అనుభవశాలితో పని చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లుగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఆమె మరణం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తీరని లోటుగా అల్లు అర్జున్ అభివర్ణించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాకు అప్పటి ఇండియన్ స్టార్ కొరియోగ్రాఫర్ స‌రోజ్ ఖాన్ కొరియోగ్రాఫ‌ర్‌గా పని చేశారు. ఈ సినిమాతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ జ‌రిగింది. ఈ సినిమాలో డాన్స‌ర్‌గా అల్లు అర్జున్ వేసిన స్టైప్స్ మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ వేసిన‌ ఈ డాన్స్ మూమెంట్స్‌ని స్వ‌యంగా స‌రోజ్ ఖాన్ కంపోజ్ చేయ‌డం విశేషం. చిరు న‌టించిన ‘చూడాల‌ని ఉంది’ సినిమాకి కూడా స‌రోజ్ ఖాన్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశారు.

Related posts