telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేక్షకులను థ్రిల్ చేయనున్న అల్లు అర్జున్

allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా” చిత్రం విడుద‌లై దాదాపు సంవ‌త్స‌రం అవుతోంది. బన్నీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం బ‌న్నీ, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. త్రివిక్ర‌మ్ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి కాగా, రెండో షెడ్యూల్ జూన్ 4 నుండి 30 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేస్తున్న‌ “ఐకాన్” సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏక‌కాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్ జ‌రిపి, వ‌చ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తేవాల‌ని అనుకుంటున్నార‌ట‌. త్రివిక్ర‌మ్ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా, “ఐకాన్” చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ అవుతుంద‌ని అంటున్నారు. మొత్తానికి ఏడాది గ్యాప్ ఇచ్చిన బ‌న్నీ వ‌చ్చే ఏడాది రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయనున్నాడన్నమాట.

Related posts