telugu navyamedia
సినిమా వార్తలు

1500 కోట్ల భారీ బడ్జెట్ తో 3డి “రామాయణం”

Allu-Aravind

మ‌న సంస్కృతికి అద్దం ప‌ట్టే ఇతిహాసాల్లో రామాయ‌ణంకు ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే ఇప్పటికే రామాయణాన్ని వెండి తెరపై, బుల్లితెరపై ప్రదర్శించారు మన దర్శకనిర్మాతలు. తాజాగా “రామాయ‌ణం”ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డానికి నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా సిద్ధ‌మ‌య్యారు. దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి, మామ్ ద‌ర్శ‌కుడు ర‌వి ఉద్యావ‌ర్ ద‌ర్శ‌కులుగా మూడు పార్టులుగా రామాయణాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. 1500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని 3డీ టెక్నాల‌జీతో సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌నుంది. ఇందులో న‌టించ‌బోయే న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాలు మాత్రం వెల్ల‌డికాలేదు. ఇప్పటికే వెయ్యికోట్ల బడ్జెట్‌తో మహాభారతను మలయాళం మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రకటించారు. ఆయన మహాభారతలో భీమ పాత్రను పోషిస్తారని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. ఇప్పుడు మరో భారీ బడ్జెట్ తో “రామాయణం” తెరపైకి వచ్చింది.

Related posts