telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

లోపలికి రానివ్వాలంటూ మొసలి విన్నపం… నిజమే…!?

Alligator

సాధారణంగా మనం ఎవరి ఇంట్లోకైనా వెళ్లాలంటే వారి అనుమతి కోసం కాలింగ్ బెల్ కొడతాము. అయితే ఇటీవల కాలిపోర్నియాలో జరిగిన ఈ సంఘటన. మైర్టిల్ ప్రాంతానికి చెందిన కారెన్ ఆల్ఫానో అనే మహిళ షాపింగ్‌కు వెళ్లి తిరిగొచ్చేసరికి ఇంటి ముందు ఎవరో తచ్చట్లాడుతున్నట్లు శబ్దాలు వినిపించాయి. ఎవరై ఉంటారా అని వెళ్లి చూసిన కారెన్ గుండె ఆగినంతపనైంది. ఎందుకంటే తన ఇంటి తలుపు కొడుతోంది ఓ మొసలి. వెనక కాళ్ళపై బలవంతంగా నిలబడ్డ ఆ జీవి.. తలుపు కొడుతూ, ఇంటి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని చూసిన కారెన్ వెంటనే తన ఫోన్‌ తీసి మొసలి ప్రవర్తనను కెమెరాలో బంధించింది. కాలింగ్ బెల్ అందకపోవడంతో కాసేపటికి నిరుత్సాహంతో వెనక్కి తిరిగిన ఆ మొసలి గురించి సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు.. దాన్ని తీసుకెళ్లి ఊరి చివరలో విడిచిపెట్టి వచ్చారు. ఇటీవలే ఓ పిల్లి కూడా కార్డిఫ్‌లో ఇలానే ఓ ఇంటి తలుపు కొడుతూ దర్శనమిచ్చింది. దాన్ని కూడా వీడియో తీసిన ఆ ఇంటి యజమాని దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Related posts