telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగులోనూ .. ‘అల్లాదిన్‌’ చిత్రం …

alladin movie in telugu also

హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నొయిమీ స్కాట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అల్లాదిన్‌’. ఒకప్పుడు చిన్నారులను విశేషంగా అలరించిన ఈ యానిమేటెడ్‌ మూవీ, ఇప్పుడు లైవ్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘అల్లాదిన్‌’ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా.. జీనీ పాత్రను పోషించిన విల్‌స్మిత్‌కు అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ డబ్బింగ్‌ చెప్పగా, అల్లాదిన్‌ పాత్రకు వరుణ్‌తేజ్‌ గొంతును అరువిచ్చారు. ఇటీవల విడుదల చేసిన మొదటి టీజర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిత్ర బృందం తాజాగా మరో టీజర్‌ను విడుదల చేసింది. ‘నీకు మూడు కోరికలు కోరే అవకాశం ఉంది. దీపాన్ని రుద్ది నువ్వు ఆ కోరికలు కోరడమే’ అంటూ జీనీగా పాత్రకు వెంకటేష్‌ డైలాగ్‌లు చెప్పడం నవ్వులు పూయిస్తోంది. వాల్‌డిస్నీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గాయ్‌ రిట్చీ తెరకెక్కిస్తున్నారు.

Related posts