telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సరుకుల సౌలభ్యం కోసం.. దేశంలో ఒకే రేషన్ కార్డు!

Ration Shop Telangana

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయనుంది. రేషన్ కార్డు లబ్ధిదారులు ఇకపై దేశంలో ఎక్కడున్న సరకులు పొందేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. కేంద్ర ఆహార శాఖామంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం రాష్ట్రాల కార్యదర్శులు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ ఆహార భద్రత చట్టం సహా పలు అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నట్టు తెలిపారు.

దేశంలో ఎక్కడైనా పనిచేసే రేషన్‌కార్డు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ విధానం వల్ల వివిద ప్రాంతాలకు వెళ్ళే వలసదారులకు రేషన్ సరకుల ఇబ్బందులు తొలగనున్నాయి. ఇప్పటికే ఈ విధానాన్ని ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో అమలులో ఉంది. రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానం అమలుకు సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో కేంద్రం దేశంలో ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసింది.

Related posts