telugu navyamedia
తెలంగాణ వార్తలు

తుఫాన్‌ కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా

గులాబ్ తుఫాన్ ప్ర‌భావంతో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. శ‌నివారం ఉద‌యం నుంచి రాష్ట్రంలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మ‌రోవైపు రేపు, ఎల్లుండి కూడా భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న‌ద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు. తెలంగాణలోని 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీచేశారు. అలాగే మరో 13 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేశారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధమయ్యాయి.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో (రేపు, ఎల్లుండి) రాష్ట్రంలో జ‌రుగాల్సిన‌ ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల‌ను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.

Related posts