telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స‌ర్వం సిద్ధం ..

అఖిలాండకోటి బ్ర‌హ్మాండ నాయుకుడు, క‌లియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమయింది. కలియుగంలో భక్తులను రక్షించేందుకు సాక్షాత్తూ విష్ణుమూర్తే… వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా ఏడుకోండల్లో కోలువైయున్న క్షేత్రం తిరుమల తిరుప‌తి.

అందుకే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇంతంటి పుణ్యస్ధలంలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించిన స్వామి శ్రీవేంకటేశ్వరుడు. అందుకే శ్రీవారిని శ్రీనివాసుడుగా, తిరుమలేశుడుగా, వెంకటేశ్వరుడిగా, ఆపదమొక్కులవాడుగా, సప్తగిరీశుడుగా, గోవిందుడుగా ఇలా అనంతమైన పేర్లతో భక్తులు స్వామివారిని కొలుస్తారు. అందుకే తిరుమలేశుని కోవెల నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రసిద్ది గాంచింది.

Adhika Masam Brahmotsavam' begins at Tirumala | Deccan Heraldఏడాది పొడవునా ఉత్సవాలు జరిగే తిరుమలలో.. ఏడాదికి ఒక్కసారే జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకతే వేరు. ప్రతి ఏడాది తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని, వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించాలని భక్త కోటీ ఉవ్విళ్లూరుతుంది. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు ఈరోజున అంకురార్పణ జరుగనుంది.

బుధవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు 6 గంట‌ల‌నుంచి 7 గంట‌ల మ‌ధ్య‌ అంకురార్పణ చేస్తారు. పుట్టమన్ను సేకరించి నవధాన్యాలు విత్తి వేడుకలకు అంకురార్పణ చేస్తారు. గురువారం సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యే బ్ర‌హ్మోత్స‌వాలు ఈ నెల 15 వరకు జ‌ర‌గ‌నున్నాయి. రేపు రాత్రి నిర్వహించనున్న పెదశేష వాహన సేవతో స్వామివారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు విహరించనున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల వేళ రంగు రంగుల విద్యుత్ శోభ‌తో మెరిసిపోతుంది.

కాగా..క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టీటీడి నిర్ణ‌యించింది. దీంతో భ‌క్తుల‌కు మాడ‌వీధుల్లో శ్రీవార వాహాన సేవ‌ల ద‌ర్శ‌న భాగ్యం ఉండ‌దు.

Related posts