telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

20 ఏళ్ళ జిమ్నాస్టిక్ ప్రయాణంలో .. 150 స్వర్ణాలు …: అలికాజో

alikajo got 150 gold medals in

అలికాజో మూడేండ్ల వయస్సులోనే జిమ్నాస్టిక్ ఆటలోకి ప్రవేశించి కఠోరసాధనతో 20 సంవత్సరాలుగా ఉంటూ వివిధ దేశాలు, రాష్ట్రాలలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 150 స్వర్ణ పతకాలను సాధించింది. తల్లిదండ్రులది కేరళ అయినప్పటికీ హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. ప్రముఖుల ప్రశంసలు.. జిమ్నాస్టిక్‌లో రాణిస్తున్న అలికాజోను తాజా, మాజీ ముఖ్యమంత్రులు, వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు, ప్రముఖ క్రీడాకారులు ఎందరో ప్రశంసించారు. పలు వేదికలపై జ్ఞాపికలను, ప్రశంస పత్రాలను అందించి అలికా జో ప్రతిభను మెచ్చుకున్నారు. అతిథుల ఆశీర్వచనాలు పొందిన అలికా మరింత పట్టుదలతో ఆడి మరెన్నో పతకాలను సాధించింది.

తాను తర్ఫీదు పొందిన క్రీడలో తనకంటే ప్రతిభావంతులను తయారు చేయాలనే తపనతో జిమ్నాస్టిక్ ఆటల్లో నేటితరం చిన్నారులు రాణించేలా మణికొండలో జిమ్నాస్టిక్ అకాడమీని నెలకొల్పి అకాడమీలో 10మంది చిన్నారులను రిథమిక్ జిమ్నాస్టిక్‌లో శిక్షణ ఇస్తున్నారు. పాల్గొన్న ప్రాంతాలు.. సాధించిన పతకాల విషయానికి వస్తే – 2013లో హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన సౌత్ జోన్ నేషనల్ పోటీలో బంగారు పతకం – వివిధ విభాగాల్లో రిథమిక్ జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 150 స్వర్ణ పతకాలు సాధించింది – రష్యా, చైనా దేశాల్లో ఉష్షూ మార్షల్స్ ఆర్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నది – 2017లో రష్యా విన్నర్ ఆఫ్ గోల్డ్ యూనివర్సిటీలో పాల్గొన్నారు. – 2016లో చైనాలోని బీచింగ్‌లో పాల్గొన్నారు. – తెలంగాణలో జరిగిన థర్డ్ వరల్డ్ చాంపియన్‌షిప్ చిక్వాలో పాల్గొన్నారు.

Related posts