telugu navyamedia
క్రైమ్ వార్తలు

అల్ ఖైదా చీఫ్‌ అల్-జవహరీని మ‌ట్టు పెట్టిన అమెరికా..

*అల్ ఖైదా అగ్ర నాయకుడు అల్-జవహరీని మ‌ట్టు పెట్టిన అమెరికా
*లాడెన్‌తో క‌లిసి అనేక ఉగ్ర‌దాడులు నిర్వ‌హించిన అల్ జ‌వ‌హ‌రిని
*లాడెన్‌ను అంత‌మొందించిన 11 ఏళ్ళ త‌రువాత మ‌ట్టు బెట్టిన అమెరికా

ఒసామా బిన్ లాడెన్ ప్రధాన అనుచరుడు, అల్ ఖైదా చీఫ్ అల్-జవహరీ (71)ని అమెరికా ఎట్ట‌కేల‌కు మట్టుబెట్టింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ లో జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరీని హతమార్చినట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ విష‌యాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

9/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో హతమార్చిన తర్వాత అల్‌ఖైదాపై మళ్లీ ప్రతీకారం తీర్చుకున్నామని అమెరికన్ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు చెప్పారు.

అల్ జవహరీ కూడా బిన్ లాడెన్ లాగానే.. బిజినెస్ అండ్ ఎకనామిక్స్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు. అలాగే ఆయన 71 ఏళ్ల వయసులో కూడా ఈజిప్టు సైన్యంలో చేరి మూడేళ్ల పాటు సర్జన్ గా పని చేశాడు.

1981వ సంవత్సరం అక్టోబర్ లో ప్రెసిడెంట్ అన్వర్ సాదత్ ను చంపిన కేసులో వందల మందిని అరెస్ట్ చేశారు. ఇందులో అల్ జవహరీ కూడా ఉన్నాడు. 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన ఈ కేసులో ఇరుక్కున్నారు. అరెస్టు అయిన అల్ జవహరీని పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారు. ఆ తర్వాత అల్ జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారాడు.

2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3 వేల మంది మరణించారు. అమెరికా గడ్డపైనే నాలుగు విమానాలను హైజాక్ చేసిన టెర్రరిస్టులు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ)లోని రెండు టవర్లను 2 విమానాలతో ఢీకొట్టించడం, మూడో విమానాన్ని పెంటగాన్‌పై కూల్చడం, నాలుగో విమానం షాంక్‌విల్లేలోని పొలంలో కూలిపోవడం తెలిసిందే. నాటి దాడుల్లో 3,000 మంది చనిపోయారు. అప్పటి నుంచి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా జవహరీని పరారీలోనే ఉన్నాడు. ఒసామ్ బిన్ లాడెన్ ను హతమార్చిన తర్వాత జవహరీ తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డును యూఎస్ ప్రకటించింది.

al zawahiri died

“అమెరికా తన పౌరులను రక్షించడంలో కోసం ఎల్లవేళలా అండగా ఉంటుంద‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అదేవిధంగా మాకు హాని కలిగించే వారికి ప్రతీకారం తీర్చుకునే తీరుతామ‌ని. ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా మేము కనుగొని హతమార్చడానికి ఎంతో సమయం పట్టదని ఈరోజు మళ్లీ రుజువు చేశాం” అని జవహరీ హతం ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.

కాగా..కాబుల్ లోని షేర్పూర్ ప్రాంతంలోని ఓ నివాసంపై వైమానిక దాడి జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశాడు. ఈ దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఖండించారు. ఈ ఘటనలో అల్ జవహరీ హతమైనప్పటికీ.. మరెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వివరించారు.

 

Related posts