telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హౌస్‌ఫుల్ 4 : “బూత్ రాజా” వీడియో సాంగ్

HF

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన‌ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. హౌస్‌ఫుల్ ఫ్రాంచైస్‌లో రాబోతున్న నాలుగో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. పునర్జన్మల నేపథ్యంలో 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో బోలెడన్ని వినోదాలు ఉంటాయని అంటున్నారు. దీపావళి కానుకగా అక్టోబ‌ర్ 25న‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 600 ఏళ్ల తర్వాత పుట్టిన స్టార్స్ ఏ ర‌కంగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నార‌నేది సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఫర్హాద్ సంఝీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల‌య్యాయి. ఇక బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవ పాత్ర‌తో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా ద‌గ్గుబాటి “హౌస్‌ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “బూత్ రాజా” అనే వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts