telugu navyamedia
సినిమా వార్తలు

చెరుకు తోటలో చారెడు బియ్యం.. లగెత్తి కొడితే లడ్డుండా..

అక్కినేని నాగార్జున హీరోగా న‌టిస్తున్న సినిమా ‘బంగార్రాజు’ . ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు.

లడ్డుండా మాస్ బీట్స్ అదుర్స్..స్వర్గంలో రెచ్చిపోతున్న బంగార్రాజు

తాజాగా ఈ సినిమా నుంచి ‘లడ్డుండా’ అనే లిరికల్‌ పాటను మంగళవారం నాగార్జున విడుదల చేశారు. ధనుంజయ, మోహన బోగరాజు, హరిప్రియ, నూతన్‌ మోహన్‌ ఈపాటను ఆలపించారు.

‘బాబూ.. తబలా.. అబ్బాయ్ ఆర్మనీ ‘.. డంటకు డడనా’ చెరుకు తోటలో చారెడు బియ్యం.. వంగ తోటలో మరదలి కయ్యం.. లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’ అంటూ పాటకు ముందు వచ్చే సాకీని నాగార్జున స్వ‌యంగా పాడారు. ఆయన చెప్పిన గోదావరి యాస డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో నాగ్ తో పాటు చిత్రంలోని రంభ, ఊర్వశి, మేనకలు క‌నిపించారు. దీనికి సంబంధించిన వీడియోను నాగచైతన్య షేర్‌ చేస్తూ.. “నాన్నా.. నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్‌ చేయలేరు” అని ట్వీట్‌ చేశారు.

అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Related posts