akash ambani engagemet invitation with shloka

ఆకాష్ తో శ్లోకా నిర్చితార్ద ఆహ్వానం

26

ఇటీవల ముంబైలో ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ కి రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా తో గోవాలో నిర్చితార్ధం అయ్యిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం మే 24న జరిగింది. అప్పుడు ఈ వేడుకకు సంబందించిన ఫోటోలు కూడా సామజిక మాధ్యమాలలో హల్ చల్ చేశాయి కూడా. వివాహం కూడా వచ్చే ఏడాదిలో జరగనున్నట్టు కూడా అప్పుడు చెప్పారు. కానీ ఇవన్నీ ఆయా కుటుంబాలు అధికారికంగా ప్రకటించలేదు, అంటే అవన్నీ ఒట్టి వార్తలే అన్నమాట.

akash ambani engagemet invitation with shloka

ఇప్పుడు ఈ జంటకి నిర్చితార్థ వేడుక జరగనున్నట్టు ఓ ఆహ్వాన పత్రిక కూడా వచ్చేసింది. ఈ ఆహ్వాన పత్రికలో శ్రీమతి కోకిలాబెన్ మరియు శ్రీ ధీరుభాయి అంబానీ; శ్రీమతి పూర్ణిమాబిన్ మరియు శ్రీ రవీంద్రభాయి దలాల్ ఆశీస్సులతో ఆకాష్ తో శ్రీమతి మోనా మరియు శ్రీ రస్సెల్ మెహతా పుత్రిక శ్లోకా కు జరిగే నిర్చితార్థ వేడుకకు హాజరవ్వాలని ఉంది. ఈ వేడుక జూన్ 30, 2018; శనివారం నాడు 39, అల్తమౌంట్ రోడ్, ముంబై లో జరుగుతుందని, సదరు తారీకును గుర్తుపెట్టుకోమని, మళ్ళీ అందరిని స్వయంగా ఆహ్వానిస్తామని…నీతా, ముకేశ్, ఇషా మరియు అనంత్ అంబానీ అని ఉంది.

 ఇది ఆహ్వానపత్రిక అయితే అదికూడా మళ్ళీ వచ్చి పిలుస్తామని అంటున్నారు, ఇంతకీ ఈ ఆహ్వానం కూడా సామజిక మాధ్యమాలలో పుట్టుకొచ్చినదేనా…నిజంగా వీరిద్దరికి నిర్చితార్థం జరుగుతుందా..!