telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్… వైట్ డ్రెస్ లో దేవకన్యలా ఐశ్వర్య

Ishwarya-Rai

ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌ ప్రాంతంలో 72వ అంత‌ర్జాతీయ కేన్స్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలో మ‌న బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రియాంక‌, దీపికా ప‌దుకొనె, కంగ‌నా రెడ్ కార్పెట్‌పై సంద‌డి చేశారు. ఇక ఇటీవల గోల్డెన్ గౌన్ డ్రెస్సులో రెడ్‌కార్పెట్‌పై మెరిసింది ఐష్. సాగ‌ర‌క‌న్య త‌ర‌హాలో ఉన్న గౌన్‌ను ధ‌రించిన ఆమె ఈ వేడుకలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. కూతురు ఆరాధ్య‌తో స‌హ ఐశ్వ‌ర్య ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు హాజ‌రైంది. ఇక మ‌రుస‌టి రోజు ఐశ్వ‌ర్య‌రాయ్ తెలుపు రంగు దుస్తుల‌లో జిగేల్‌మంది. స్వ‌ర్గం నుండి దిగి వచ్చిన దేవక‌న్య‌లా… రెడ్ కార్పెట్‌పై తెలుపు రంగు దుస్తుల్లో హోయ‌లొలికిస్తున్న ఐశ్వర్య‌రాయ్‌ని చూడడానికి వీక్ష‌కుల‌కి రెండు క‌ళ్ళు చాల‌లేద‌ట‌. ప్ర‌తి ఏడాది కేన్స్ ఉత్స‌వాల‌లో పాల్గొంటున్న ఐష్ ఈ సారి స‌రికొత్త లుక్స్ తో ఆక‌ట్టుకుంటోంది. మే 25 వ‌ర‌కు కేన్స్ ఉత్స‌వాలు జ‌ర‌గ‌నుండ‌గా, అప్పటివరకూ అక్కడ ప‌లు చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న జరుగుతోంది. అయితే ఈసారి తెలుగు సినిమాలకు కేన్స్ లో స్థానం దక్కకపోవడం గమనార్హం.

Related posts