telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సినిమా వార్తలు

ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్

Airtel

ఎయిర్ టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. బేస్ ప్లాన్ ధరను రూ.23 నుంచి రూ.45కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇంతకుముందున్న బేస్ ప్లాన్ ధరను 95 శాతం వరకు ఎయిర్ టెల్ పెంచింది. ఈ ప్రకటన ప్రకారం… ఎయిర్ టెల్ కొత్త వినియోగదారులకు ఇకనుంచి లోకల్, ఎస్టీడీ కాల్స్ కు సెకనుకు 2.5 పైసల టారిఫ్ వర్తించనుంది. నేషనల్ వీడియో కాల్స్ చేసుకునే వారు సెకనుకు 5 పైసలు చెల్లించాలి. మొబైల్ డేటా విషయానికి వస్తే.. ఒక ఎంబీ డేటా ఖరీదు 50 పైసలుగా ఉండనుంది. లోకల్ ఎస్ఎంఎస్ కు రూ.1, నేషనల్ ఎస్ఎంఎస్ కు రూ.1.5, ఇంటర్నేషనల్ ఎస్ఎంఎస్ కు రూ.5 చార్జీ విధించనున్నారు. ఇంతకు ముందు ఇవే లాభాలు రూ.23 బేస్ ప్లాన్ తో లభించేవి. ఇప్పుడు దాన్ని రూ.45కు పెంచారు. అంతేకాకుండా ఇకపై ఎయిర్ టెల్ వినియోగదారులు ప్రతీ 28 రోజులకు కనీసం రూ.45 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ తో రీచార్జ్ చేయాల్సిందేనని ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ మీరు ప్రతీ 28 రోజులకు కనీసం రూ.45 రీచార్జ్ చేయకపోతే గ్రేస్ పీరియడ్ తర్వాత సేవలన్నిటినీ సస్పెండ్ చేస్తామని పేర్కొంది. ఈ గ్రేస్ పీరియడ్ ను 15 రోజులుగా నిర్ణయించారు. ఒకవేళ… ఎయిర్ టెల్ వినియోగదారులు ఎవరైనా రూ.45 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఎస్టీవీ/కాంబో/టాప్-అప్ రీచార్జ్ చేసుకుంటే ఈ ఎస్టీవీ/కాంబో వ్యాలిడిటీకి అనుగుణంగా టారిఫ్ వ్యాలిడిటీ కూడా పెరుగుతుంది. ఒకవేళ సాధారణ టాప్-అప్ చేసుకుంటే అది 28 రోజుల వరకు మాత్రమే ఉండనుంది. కాబట్టి ఎయిర్ టెల్ వినియోగదారులు ఇకపై తమ సేవలను నిరంతరాయంగా ఉపయోగించుకోవాలనుకుంటే… ప్రతి 28 రోజులకు ఒకసారి కచ్చితంగా రూ.45తో రీచార్జ్ చేసుకోవాల్సిందే.

Related posts